Virtual credit cards: డిజిటల్ చెల్లింపుల కోసం ఒక స్మార్ట్ ఎంపిక! దీంతో స్కామర్ల మోసాలకు చెక్! 6 d ago

featured-image

దేశవ్యాప్తంగా డిజిటల్ వినియోగాలు పెరిగిపోయాయి. ఆన్‌లైన్ షాపింగ్.. డిజిటల్ సేవలు వంటివి మన రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. అయితే ఇదే మంచి అదునుగా తీసుకుని సైబర్ నేరస్థులు ప్రజలను మోసగించి రూ.కోట్లలో డబ్బులు కాజేస్తున్నారు. ఇటీవల కాలంలో వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాలు దొంగిలించడం వంటి మోసాలకు గురవుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. సైబర్ నేరస్థులు బ్యాంకు అకౌంట్లు, క్రెడిట్ కార్డుల నుంచి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలు వెతుకుతున్నారు. నకిలీ వెబ్‌సైట్ల నుంచి ట్రేడింగ్ స్కామ్స్ వరకు.. ఎన్నో మార్గాల్లో ప్రజల డబ్బును కేటుగాళ్లు దోచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో, ఆన్‌లైన్ లావాదేవీలను సురక్షితం చేయడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వర్చువల్ క్రెడిట్ కార్డులను (VCCలు) అందిస్తున్నాయి. నిజమైన క్రెడిట్ కార్డు వివరాలను బయటపెట్టకుండా ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి వర్చువల్ క్రెడిట్ కార్డులు ఉపయోగపడతాయి. వీటిని వాడటం చాలా సులభం, అంతేకాకుండా ఇవి చాలా సురక్షితమైనవి.


అసలు వర్చువల్ క్రెడిట్ కార్డు అంటే ఏంటి.?

వర్చువల్ క్రెడిట్ కార్డు అనేది సాధారణ క్రెడిట్ కార్డుకు ఒక తాత్కాలిక.. డిజిటల్ ప్రతిరూపం. ఇది ఆన్‌లైన్ కొనుగోళ్ల కోసమే రూపొందించబడింది. ఈ కార్డులో ప్రతీ లావాదేవీకి ఒక కొత్త, ప్రత్యేకమైన కార్డ్ నంబర్, వ్యాలిడిటీ, మరియు CVV కోడ్ ఉంటాయి. దీనివల్ల మీ అసలు క్రెడిట్ కార్డు వివరాలు బయటకు తెలిసే ప్రమాదం తగ్గి సురక్షితంగా ఉంటాయి.


ఇది ఎలా పని చేస్తుంది?

మీరు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పుడు..మీ అసలు క్రెడిట్ కార్డ్ వివరాలకు బదులుగా, మీ బ్యాంక్ లేదా మొబైల్ యాప్ ద్వారా జనరేట్ అయిన వర్చువల్ కార్డ్ వివరాలను నమోదు చేయాలి. ఈ వర్చువల్ కార్డ్ నంబర్, CVV, మరియు గడువు తేదీ మీ అసలు క్రెడిట్ కార్డ్ కన్నా భిన్నంగా ఉంటాయి. పైగా ఈ వివరాలను కాల పరిమితిని బట్టి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఉపయోగించగలం. ఎప్పుడైతే మీరు పంపించిన వివరాలు మీ బ్యాంక్ కు సింక్ అయిన.. తర్వాత లావాదేవీ మీ క్రెడిట్ కార్డ్ ఖాతా ద్వారా ప్రాసెస్ అవుతుంది. ఈ విధంగా మీ అసలు క్రెడిట్ కార్డ్ వివరాలు బయటకు తెలియకుండా.. వర్చువల్ కార్డ్ వివరాలతో చెల్లింపు పూర్తవుతుంది. దీనివల్ల ఆన్‌లైన్ మోసాల నుండి కొంత వరకు రక్షణ లభిస్తుంది.


వర్చువల్ క్రెడిట్ కార్డుల వల్ల ఉపయోగాలు:


మెరుగైన భద్రత: 

వర్చువల్ క్రెడిట్ కార్డులలో మీ అసలు క్రెడిట్ కార్డు వివరాలు ఉండవు. ప్రతి ట్రాన్సాక్ష‌న్‌ కోసం ఒక ప్రత్యేకమైన కార్డ్ నంబర్ జెనరేట్ అవుతుంది. ఇది మోసాలు మరియు అనవసరమైన వినియోగం నుండి రక్షణ కల్పిస్తుంది.


నియంత్రణ:

కొన్ని వర్చువల్ కార్డ్ సేవలు ఖర్చు పరిమితులను సెట్ చేయడానికి అనుమతిస్తాయి.. దీనివల్ల మీ ఆన్‌లైన్ ఖర్చులను తగ్గించుకోవచ్చు. సరిగ్గా తెలియని వెబ్‌సైట్‌లలో కొనుగోళ్లు చేసేటప్పుడు లేదా సబ్‌స్క్రిప్షన్‌లను నిర్వహించేటప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


సౌకర్యం: 

వర్చువల్ క్రెడిట్ కార్డులు ఆన్లైన్ కొనుగోళ్ళను మరింత సులభతరం చేస్తాయి. మీరు ఇంటర్నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏది కావాలన్నా కొనుగోలు చేయవచ్చు.


సబ్‌స్క్రిప్షన్ సర్వీసులు:

మీరు నెట్‌ఫ్లిక్స్ లేదా ప్రైమ్ లాంటి సబ్‌స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు మీ అసలు క్రెడిట్ కార్డు వివరాలు ఇవ్వకుండా..వర్చువల్ క్రెడిట్ కార్డు ఉపయోగించడం మంచిది. దీనివల్ల మీ అసలు కార్డు వివరాలు ఎవరికీ తెలియకుండా సురక్షితంగా చెల్లించవచ్చు.


వర్చువల్ క్రెడిట్ కార్డులు ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ లు.. అలాగే ఇతర లావాదేవీల్లో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ వర్చువల్ క్రెడిట్ కార్డులు చాలా విధాలుగా ఉపయోగ పడతాయి. ఇవి ఆన్‌లైన్ మోసాల నుండి రక్షిస్తాయి. మీ అసలు కార్డు వివరాలు ఇవ్వకుండా.. తాత్కాలిక నంబర్‌తో చెల్లించుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఆన్‌లైన్ కొనుగోళ్లు, సబ్‌స్క్రిప్షన్‌లకు బాగా ఉపయోగపడుతుంది. ఇది వాడటం సురక్షితం.. సౌకర్యవంతం కూడా. మీ డబ్బును స్కామర్లు నుండి కాపాడుకోవడానికి ఇది ఒక మంచి మార్గం.


ఇది చదవండి: 'బ్లూ' రోబోట్ ఆవిష్కరణ.! కొత్త యుగానికి.. కొత్త నాంది.!

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD